Authorization
Thu March 20, 2025 10:30:55 pm
- కోసం ఉద్యమాలు అవసరం
- శ్రామిక మహిళా ఫోరం రాష్ట్ర కన్వీనర్ పి. ప్రేమ్ పావని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహిళల సాధికారత, లింగ సమానత్వం, హక్కులను పరిరక్షించడం, వారి జీవితాలను మెరుగుపరచడం కోసం ఉద్యమాలు చేయవలసిన అవసరం ఉందని శ్రామిక మహిళా ఫోరం రాష్ట్ర కన్వీనర్ పి. ప్రేమ్ పావని ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని సత్యనారాయణరెడ్డి భవన్లో శ్రామిక మహిళా ఫోరం (ఏఐటీయూసీ) రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సమానత్వం కోసం పోరాటంలో మహిళలు కొంత పురోగతి సాధించారని పేర్కొన్నారు. పేదరికం, నిరక్షరాస్యత మహిళల జీవితాలను కష్టతరం చేస్తున్నాయని తెలిపారు. సమాజాభివృద్ధిలో మహిళలు ముఖ్యపాత్ర పోషిస్తున్నారన్న విషయాన్నీ ప్రభుత్వాలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. మహిళలు తమ హక్కుల కోసం ప్రతిరోజూ ఎక్కడికక్కడ ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మహిళా సమాఖ్య సీనియర్ నాయకులు ఎస్ ఛాయాదేవి, కోశాధికారి లక్ష్మి, నగర నాయకులు జ్యోతి, శ్రీదేవి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.