Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు ఉద్యోగుల నోటిఫికేషన్లు ఇస్తారని ఆశిస్తున్న
- సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సీఎం కేసీఆర్ మొట్టమొదటిసారి నిరుద్యోగుల గురించి మాట్లాడటం శుభపరిణామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బుధవారం ఉదయం 10గంటలకు టీవీలు చూడాలని సీఎం చెబుతున్నారంటే, ఉద్యోగు ల నోటిఫికేషన్లు ఇస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈమేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దాదాపు మూడు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తానని సీఎం ప్రకటిసా ్తడేమోనని ప్రతిపక్ష నేతగా భావిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో అధికారికంగా ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న నిరుద్యోగులు దాదాపుగా రూ 25 లక్షల మంది ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయని గుర్తు చేశారు.