Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేకుంటే ఉమ్మడి సమావేశం పెడ్తాం
- ఆర్టీసీ కార్మికుల సమస్యలపై మానవహక్కుల కమిషన్ ఆదేశం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఏప్రిల్ 13వ తేదీ లోపు పరిష్కరించాలనీ, లేకుంటే సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, యూనియన్ నాయకులతో ఉమ్మడి సమావేశాన్ని తామే ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చెప్పింది. 8 గంటల పనిదినాన్ని 12 గంటలకు పెంచారనీ, వేతనాలు పెంచట్లేదనీ, డిఏలు ఇవ్వట్లేదనీ, మోటారు ట్రాన్స్పోర్ట్ యాక్ట్‌ను అమలు చేయట్లేదంటూ పలు సమస్యల్ని ప్రస్తావిస్తూ టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ మానవ హక్కుల కమిషన్‌లో వేసిన పిటీషన్‌పై మంగళవారం ఉత్తర్వులు విడుదల అయ్యాయి. ఈ నిర్ణయం పట్ల ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ బాబు, కే రాజిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. యాజమాన్యం స్పందించాలనీ, యూనియన్లకు చర్చలకు పిలవాలని విజ్ఞప్తి చేశారు.