Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిపక్షాల గొంతునొక్కుతున్నారు : బక్క జడ్సన్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారమదంతో వ్యవహరిస్తూ... తెలంగాణ గడాఫీలా తయారయ్యారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ విమర్శించారు. సోమవారం అసెంబ్లీలో స్పీకర్ వ్యవహరించిన తీరు ప్రతిపక్షాల గొంతు నొక్కేలా ఉందని చెప్పారు. ఒకవైపు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుతూనే... సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మహిళా గవర్నర్‌ను అవమానించారని విమర్శించారు. హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌లోని 125 అడుగుల అంబేద్కర్ ఏర్పాటు చేస్తామని మోసం చేసిన స్థలంలో నల్ల రిబ్బన్లు కట్టుకుని ఆయన మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జడ్సన్ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీని తలపిస్తున్నదన్నారు. తెలంగాణ ఉద్యమ అమరుల కుటుంబాలకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పటికీ పైసా కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.