Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎస్ఎల్జీ ఆస్పత్రి 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' సందర్భంగా మహిళల కోసం 'ఉచిత ఆరోగ్య అవగాహన శిబిరం' నిర్వహించింది. గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది కోసం ఈ శిబిరాన్ని నిర్వహించారు. గ్రియెట్లో చదువుతున్న, పని చేస్తున్న అన్ని వయస్సుల మహిళలు కలిసి దాదాపు 320 మంది ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎల్జీ ఆస్పత్రిలోని కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అర్చనా ప్రత్తిపాటి మాట్లాడుతూ 'రాబోయే రోజుల్లో జీవన నాణ్యతను ప్రభావితం చేసే వివిధ ఆరోగ్య సమస్యల గురించి యువతులు మరింత తెలుసుకోవాలి. రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ అనేవి సాధారణ క్యాన్సర్ రకాలు. ఇవి ఏ వయసులోని మహిళలపై అయినా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అందువల్ల, ఈ క్యాన్సర్లకు కారణాలను, వాటి వ్యాప్తిని ఎలా నిరోధించొచ్చు? ఈ క్యాన్సర్లకు స్వయంగా పరీక్షించుకోవడం, నయం చేయడానికి అందుబాటులో ఉన్న చికిత్సలను యువత అర్థం చేసుకోవడం ముఖ్యం' అని తెలిపారు. ఎస్ఎల్జీ ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దండు శివరామరాజు, సీఎండీ డివిఎస్ సోమరాజు మాట్లాడుతూ 'మహిళలు పురుషులతో సమానం మాత్రమే కాదు.. బంగారు భవిష్యత్తుకు వారే మార్గదర్శకాలు. స్త్రీ ఒక స్వాప్నికురాలు, విశ్వాసి, సాధకురాలు. ఇలాంటి శిబిరాలు మంచి భవిష్యత్తును రూపొందించడానికి కషి చేసే మహిళలందరికీ అంకితం' అని చెప్పారు.