Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
రాష్ట్ర బడ్జెటల్ కేటాయింపుల్లో వికలాంగులకు మొండిచెయ్యి చూపించారని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర అధ్యక్షలు వెంకట్ అన్నారు. ఈ మేరకు ఈసీఐఎల్ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించకుండా మోసం చేసిందన్నారు. బడ్జెట్లో 5శాతం అంటే రూ.12847.92 కోట్లు వికలాంగుల సంక్షేమా నికి కేటాయించాలన్నారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం గుర్తించిన 21 రకాల వైకల్యాలను ప్రకారం రాష్ట్రంలో 20 లక్షల మంది వికలాంగులు ఉన్నారనీ, వీరి సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనడానికి ఈ బడ్జెట్ కేటాయింపులే నిదర్శనం అన్నారు. అనేక కులాల వారికి బడ్జెట్లో నిధులు కేటాయించిన ప్రభుత్వం సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన సమాజంలో వివక్షకు గురవుతున్న వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించాలనే ఆలోచన ప్రభుత్వానికి రాకపోవ డం విడ్డూరం అన్నారు. ఈ బడ్జెట్ను పరిశీలిస్తే కాంట్రాక్టర్లు, కమీషన్ల కోసమే ప్రవేశపెట్టినట్టుగా అనిపిస్తుందన్నారు. సంక్షేమం కోసం ఉన్న 2016 ఆర్పీడీ, మానసిక వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం, నేషనల్ ట్రస్టు వంటి చట్టాల అమలుకు ఎలాంటి నిధులు కేటాయించలే దన్నారు. తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులు, వారి సహాయకులకు ప్రత్యేక అలవెన్సులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిబంధనలు రూపొందించి లబ్దిదారుల ఎంపికపై కసరత్తు చేస్తుంది కానీ ఈ బడ్జెట్లో దానికోసం ఎలాంటి నిధుల్ని కేటాయించలేదన్నారు. ప్రభుత్వానికి ప్రచారం తీసుకువచ్చే అనేక పథకాలకు బడ్జెట్లో భారీగా నిధులు కేటా యించడం మీద ఉన్న శ్రద్ధ వికలాంగుల సంక్షేమ మీద లేదన్నారు. వికలాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతున్నా ఆచరణలో జరుగుతున్న దానికి పొంతన లేదన్నారు. తక్షణమే బడ్జెట్ను సవరించి వికలాంగుల సంక్షేమానికి అవసరమైన నిధులు కేటాయిం చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాలయ్య, శైన్ బేగం, మేఘమాల, సావిత్రి, రమేష్, రవీంద్ర, నవ్య, రాజు. ఐలయ్య, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.