Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిస్థితి విషమం
- పాత కక్షలే కారణం
నవతెలంగాణ-కంఠేశ్వర్
ఓ యువకుడిపై మరో వ్యక్తి తల్వార్‌తో దాడి చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రం ఐదోటౌన్ పరిధిలోని శాంతి నగర్లో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్‌కు చెందిన అమీర్, అన్వర్ అనే యువకులకు గతంలో గొడవలు జరిగాయి. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. అయితే కేసు విత్ డ్రా కోసం అన్వర్‌కు రూ.30 వేలు ఇచ్చేందుకు అమీర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ.20వేలు చెల్లించి, మరో 10 వేలు చెల్లించే విషయం మాట్లాడే క్రమంలో పాత కక్షల నేపథ్యంలో అమీర్ అనే వ్యక్తి మరి కొంత మందితో కలిసి అన్వర్పైన తల్వార్‌తో దాడి చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అన్వర్‌ను తల్వర్తో 14సార్లు పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా అన్వర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఐదో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా నగరంలో పట్టపగలే ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపింది.