Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ముస్లిం మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనీ, విద్య, ఉపాధిలో అభివృద్ధి సాధించడం ద్వారా సాధికారతను సాధించాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని ఆవాజ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆవాజ్ సహాయ కార్యదర్శి రఫత్ అధ్యక్షతన 'ముస్లిం మహిళలు- సాధికారత' అనే అంశంపై సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా అబ్బాస్ మాట్లాడుతూ ముస్లిం మహిళలలో సామాజిక చైతన్యం పెరుగుతోం దనీ,అన్యాయం అణిచివేతలపై జరుగుతున్న ఉద్యమాల్లో పాల్గొంటున్నారని చెప్పారు.సీఎఎ, ఎన్ఆర్సీ వ్యతిరేక ఉద్యమానికి ముందుండి నాయకత్వం వహించారని గుర్తుచేశారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా, పోలీసులు కేసులు పెట్టినా,మతోన్మాదులు దాడులు చేసినా వెరవకుండా పోరాటం చేశారన్నా రు.చారిత్రాత్మక రైతాంగ ఉద్యమానికి ప్రేరణ ముస్లిం మహిళలు చేసిన పోరాటమేనని చెప్పారు. శాస్త్ర, సాంకేతిక రంగాలలో ముస్లిం మహిళలు రాణిస్తున్నారన్నారు. స్వాతంత్య్ర పోరాట కాలంనుంచే ఎన్నో త్యాగాలు చేసి ఉద్యమాలకి అండగా నిలిచారని గుర్తుచేశారు. డాక్టర్లుగా, లాయర్లుగా, న్యాయమూర్తులుగా,అధ్యాపకులుగా, ఐఎఎస్, ఐపీఎస్ లాంటి అనేక బాధ్యత లు చేపట్టి సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలను చేరుకుంటారని కుటుంబాలు వారి ఎదుగుదలకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.మతోన్మాద శక్తులు తమ రాజకీయ ప్రయోజనాలకోసం ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఆర్థిక,రాజకీయ,సామాజిక రంగాలలో దేశంలో జరుగుతున్న మార్పుల ప్రభావం మహిళలపైన ఎక్కువగా ఉంటుందని చెప్పారు.ఆవాజ్ కమిటీ ముస్లిం మహిళల అభివద్ధికి కషి చేస్తోందని,దీనికి అందరూ సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అజీజ్ అహమ్మద్ ఖాన్,హమీద్,యూసఫ్,కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు ఎం.దశరథ్ ప్రసంగించారు. ఆవాజ్ ముషీరాబాద్ నాయకులు తన్వీర్ ఆలియా,సాజిదా రహమాన్, షేక్ రిజ్వానా, ఫరీన్ భాను, ఫిర్దోష్ బాన్, అర్షియా నాజ్, పరిహీన్ మెహదీ, అప్సరీ తబస్సుమ్, ఫౌజియా నౌషిన్, నాజియా తబస్సుమ్ తదితరులు పాల్గొన్నారు.