Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హక్కుల కోసం సంఘటితంగా
- పోరాడాలని వక్తల పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్ లోని ఫెడరేషన్ రాష్ట్ర కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలిండియా రేడియో జర్నలిస్టు లక్ష్మీ, సీనియర్ జర్నలిస్టు కె. మంజరి, టీవీ న్యూస్ రీడర్ రజిత, సీనియర్ సబ్ ఎడిటర్ కె.లలిత తదితరులను సత్కరించారు. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ మహిళా కార్యదర్శి ఎస్కె సలీమా, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. ఆనందం, కార్యదర్శి ఎర్రం నర్సింగ్‌రావు, హెచ్‌యూజే నాయకులు పాండురంగారావు, విజయానందరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మీడియా రంగంలో కూడా మహిళా జర్నలిస్టులు పలు సమస్యలు, వేధింపులను ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. ఏ రంగంలోనైనా సమస్యలపై సమిష్టిగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మహిళా జర్నలిస్టులకు ప్రభుత్వం, యాజమాన్యాలు తగిన సదుపాయాలు కల్పించాలని కోరారు. హక్కుల కోసం అందరూ సంఘటితంగా ఉద్యమిస్తేనే సత్ఫలితాలు వస్తాయని వ్యాఖ్యానించారు.