Authorization
Fri March 21, 2025 01:29:19 am
- రాష్ట్ర సర్కారుకు హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్‌లోని కొత్తపేటలో గల గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ కూల్చివేత పనుల్ని వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర సర్కారును హైకోర్టు ఆదేశించింది. తమ ఆదేశాలకు వ్యతిరేకంగా ఎందుకు చర్యలు చేపడుతున్నారో వివరణ ఇచ్చేందుకు స్వయంగా విచారణకు హాజరుకావాలని మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావు, డైరెక్టర్ లక్ష్మీబారులను ఆదేశించింది. విచారణను 14కి వాయిదా వేసింది. నెలరోజుల పాటు మార్కెట్‌ను తెరవాలనీ, వ్యాపారలావాదేవీలకు అనుమతించాలని ఇటీవల హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన గడువు మంగళవారం వరకు ఉన్నా.. సోమవారం అర్ధరాత్రి నుంచే 500 మంది పోలీసులను మోహరించి కూల్చివేత పనులు చేస్తున్నారని కమీషన్ ఏజెంట్లు కోర్టు ధిక్కారణ కేసు దాఖలు చేశారు. దీనిని చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది.