Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు
హైదరాబాద్ : వీఐటీ ఏపీ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను వర్చువల్ విధానంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా శ్రీమతి పద్మజ చుండూరు (మ్యానేజింగ్ డైరెక్టర్, సీఈఓ, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్, ముంబయి), గౌరవ అతిధిగా శ్రీమతి జి ముతళగి (వీఐటీ పూర్వ విద్యార్థిని, చైర్మన్, విటా) పాల్గొన్నారు. శ్రీమతి పద్మజ చుండూరు మాట్లాడుతూ సామాజికంగా, వ్యక్తిగతంగా మహిళలు ఎదగాలంటే వారికి ఆర్థిక స్వాతంత్య్రం ముఖ్యమని తెలిపారు. మహిళలు శక్తికి ప్రతిరూపాలనీ, సమయ పాలనా, నిర్ణయాధికారాలతో మహిళా అభివృద్ధి సాధ్యమని అన్నారు. గౌరవ అతిధి శ్రీమతి జి. ముతళగి మాట్లాడుతూ 111వ అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. పనిచేసే మహిళలు పనిని, జీవితాన్ని సంతులనం చేసుకుంటూ ముందుకు సాగటమే విజయానికి కీలకమని తెలిపారు. వీఐటీ ఏపీ విశ్వవిద్యాలయం మహిళా సమానత్వం కోసం కృషి చేయటం సంతోషంగా ఉందన్నారు. వీఐటీ ఫౌండర్, ఛాన్సెలర్ జి. విశ్వనాథన్ మాట్లాడుతూ పంచాయతీలలో, పార్లమెంటులో మహిళలకు 1/3 వంతు ప్రాతినిధ్యాన్ని అందించడానికి అన్ని పార్టీలకు సంబంధించిన పురుషులు సహకరించాలని కోరారు. వీఐటీ యూనివర్సల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా బాలికలకు ఉన్నత విద్య అందించాలనే సంకల్పంతో 7,000 మందికి ఉన్నత విద్యలో ఉపకార వేతనాలు అందిస్తున్నామని తెలియచేసారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులు, సిబ్బంది, అధ్యాపకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా||. ఎస్. వి. కోటా రెడ్డి, రిజిస్ట్రార్ డా|| సి. ఎల్. వి. శివకుమార్ , డిప్యూటీ డైరెక్టర్ స్టూడెంట్ వెల్ఫేర్ డా|| అనుపమ నంబూరు, విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.