Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా జిందాబాద్...
- నినదించిన మల్లు స్వరాజ్యం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గత కొద్ది రోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం... 'మహిళా సంఘం వర్థిల్లాలి, ఐద్వా జిందాబాద్...' అంటూ నినదించారు. మంగళవారం ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అరుణజ్యోతి, మల్లు లక్ష్మి, నాయకులు వినోద, లక్ష్మమ్మ, శశికళ, స్వర్ణ తదితరులు ఆమెను ఆస్పత్రిలో పరామర్శించారు. ఆ సందర్భంగా స్వరాజ్యం... తన శక్తినంతటిని కూడ దీసుకుని నినదించారు. ఇది ఆమె ఆత్మస్థైర్యానికి, ఉక్కు సంకల్పానికి నిదర్శమని ఐద్వా నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇది తమకెంతో స్ఫూర్తినిచ్చిందని వారు తెలిపారు. మరోవైపు స్వరాజ్యం ప్రస్తుతం ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారని వైద్య వర్గాలు తెలిపాయి.