Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మహిళా శక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ చేయోద్దని యాత్ర ఏక్ రాV్‌ా అధ్యక్షురాలు డాక్టర్ సుచరిత దేవరపల్లి అన్నారు. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలు అన్నిరంగాల్లోనూ సమర్థవంతంగా రాణిస్తున్నారనీ, వారికి చేయూతనిచ్చి ప్రోత్సహించాలని చెప్పారు. బ్రహ్మ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారంనాడిక్కడి వారి కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సొసైటీ అధ్యక్షులు, సామాజిక కార్యకర్త, ఫ్యామిలీ కౌన్సిలర్ మయబ్రహ్మ నర్సింహా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మహిళల సమదృష్టితోనే కుటుంబాలు వర్థిల్లుతాయని చెప్పారు. ఆదర్శ అతిధిగా పాల్గొన్న సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమ మాట్లాడుతూ రాజకీయాల్లో మహిళలు మరింత పెద్ద సంఖ్యలో రావాలని ఆకాంక్షించారు. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరిగితే మహిళల సమస్యలూ పరిష్కారమవుతాయని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పలురంగాల్లో విశేష సేవలు అందిస్తూ కృషి చేస్తున్న మహిళలను సన్మానించారు. వీఆర్ రామాచారి ఫౌండేషన్ చైర్పర్సన్ వీఆర్ లక్ష్మీ రామాచారి, సామాజిక కార్యకర్త వీఆర్ శ్రీనివాస్, రామోజీ శోభారాణి, టీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.