Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆండ్రియాల లాంగ్వాల్ గని పైకప్పు కూలిన ఘటనలో ముగ్గురు మతి చెందడం దురదృష్టకరమని సింగరేణి సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్ అన్నారు. మృతుల కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపి, విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ సిబ్బంది గనిలోకి వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన ఆరుగురిలో ముగ్గురిని రక్షించారని తెలిపారు. మిగిలిన వారిని కూడా కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. రక్షణపై ఖర్చుకు వెనకాడకుండా గనుల్లో చర్యలు తీసుకుంటున్నామనీ, అయినా ఊహించని దుర్ఘటన జరిగి ముగ్గురిని కోల్పోవడం బాధ కలిగిస్తుందన్నారు. బాధిత కుటుంబీకులకు సంస్థ పూర్తిగా అండగా ఉంటుందనీ, మతి చెందిన వారికి చెల్లించాల్సిన మొత్తాలను వెంటనే వారి కుటుంబ సభ్యులకు అందచేసి, వారి కుటుంబాల్లో అర్హులైన వారికి కోరిన చోట ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావతం కాకుండా అన్ని గనుల్లో రక్షణ తనిఖీలు నిర్వహించి తగు చర్యలు వెంటనే చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.