Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాల కోసం 2022-23 విద్యా సంవత్సరానికి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్ను విడుదల చేసింది. బుధవారం నుంచి ఈ నెల 28వ తేదీ వరకు ఆన్లైన్లో రూ. 100 రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. మే ఎనిమిదిన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ఐదో తరగతిలో 48,280 సీట్లు ఉన్నాయి. 2021-22 విద్యా సంవత్సరంలో నాలుగో తరగతి పూర్తి చేసుకుంటున్న విద్యార్థులే ఈ ప్రవేశపరీక్షకు అర్హులు. ఇతర వివరాల కోసం షషష.్రషతీవఱర.aష.ఱఅ వెబ్సైట్ను సందర్శించొచ్చని గురుకుల కార్యదర్శి రొనాల్డ్ రాస్ పేర్కొన్నారు. హెల్స్ లైన్ నెం.180042545678 గా వివరించారు.