Authorization
Thu March 20, 2025 09:50:19 pm
- ఎన్నారై టీఆర్ఎస్ నేత అనిల్ కుర్మాచలం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతున్నదని ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కుర్మాచలం అన్నారు. ఇప్పటికే లక్షకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసి, మరో 91 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని అసెంబ్లీ ప్రకటించడం సంతోషమని అన్నారు. ఈ ప్రకటన నిరుద్యోగుల పట్ల వారికున్న అభిమానానికి నిదర్శనమని అన్నారు. దేశంలో మాట తప్పని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అదీ కేసీఆరేనని గుర్తు చేశారు. నియామకాల నోటిఫికేషన్ వేసేందుకు మార్గం సుగమమం చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈమేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.