Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాటి సంగతి తేల్చేదాకా వదిలిపెట్టం : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ లక్ష ఉద్యోగాలను మాయం చేసి నిరుద్యోగుల పొట్ట గొడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరుకుమార్ విమర్శించారు. బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంపై అనవసర నిరదలు వేస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చిందెప్పుడు? 317 జీవో జారీ చేసిందెప్పుడు? అని ప్రశ్నించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయ్యేదాకా ఎన్నికలకు వెళ్లబోమనే హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోర్టు కేసు సాకులతో ఉద్యోగాల భర్తీని వాయిదా వేస్తే వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కొత్త జోనల్ వ్యవస్థకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు విడుదలైన 40 నెలల దాకా స్పందించని కేసీఆర్... తన చేతగానితనాన్ని కేంద్రంపై నెట్టడం సిగ్గు చేటన్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశంలో మిలియన్మార్చ్కు దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయనీ, లక్షలాది నిరుద్యోగ యువకులు హైదరాబాద్కు సిద్ధమవుతున్నారని తెలిసే కేసీఆర్ ఉద్యోగాల భర్తీ ప్రకటన చేశారని తెలిపారు. ఐదు రాష్ట్రాలకుగానూ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలోకి రాబోతున్నదనీ, అందుకే ఈ ప్రకటన వచ్చిందని చెప్పారు. అస్సాంలో ఒక్క ఏడాదే లక్ష ఉద్యోగాలిచ్చిన ఘనత తమ బీజేపీ ప్రభుత్వానికి ఉందన్నారు.