Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హౌప్ అడ్వర్టైజింగ్ ప్రయివేట్ లిమిటెడ్, సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ (సికా) సంయుక్తాధ్వర్యంలో మహిళలతో సంగీత విభావరి (మ్యూజికల్ ట్రీట్) నిర్వహించారు. శిల్పారామంలో ఉదయం 9.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు గాయనీమణులు వివిధ కీర్తనలు ఆలపించి, సభికులను రంజింపచేశారు. సుజనరంజని, సంప్రదాయ పద్ధతుల్లో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిధిగా చేవెళ్ల పార్లమెంటు సభ్యులు డాక్టర్ రంజిత్‌రెడ్డి, ఆర్ఆర్ ఫౌండేషన్ డైరెక్టర్ జీ సీతారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గాయనీమణులను వారు సన్మానించారు. కార్యక్రమంలో కూచిపూడి నృత్య శిక్షకురాలు డాక్టర్ దీపికారెడ్డి, మహింద్రాసీతారామశర్మ తదితరులు పాల్గొన్నారు.