Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీయూఎంహెచ్ఇయూ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వైద్యారోగ్య రంగంలో పని చేస్తున్న వివిధ కేడర్ల కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తామంటూ ప్రకటించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (టీయుఎంహెచ్ఇయూ) కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు బుధవారం ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు భూపాల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాద నాయక్ ఒక ప్రకటన విడుదల చేశారు. వివిధ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను రెగ్యులర్ చేస్తామనడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నియామకమై 22 ఏండ్లుగా అనేక బాధలు అనుభవించిన ఉద్యోగుల పక్షాన తమ యూనియన్ వివిధ రూపాల్లో దశల వారీగా ఆందోళనా పోరాటాలు, సమ్మెలు చేసిందని గుర్తుచేశారు. కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులందరిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ వారు డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య పథకాలు ప్రజలకందిస్తున్న సిబ్బంది గత మూడేండ్లుగా కరోనాతో సహవాసం చేస్తూ ప్రాణాలను లెక్క చేయకుండా పని చేస్తున్నారని తెలిపారు. వారి సర్వీసులను కూడా రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి చేశారు.