Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్లోని కేర్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, సీపీఐ(ఎం) సీనియర్ నేత మల్లు స్వరాజ్యంను అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకులు విమలక్క బుధవారం పరామర్శించారు. ఐద్వా సీనియర్ నాయకులు బి హైమావతితోపాటు నాయకులు డి ఇందిరా, కె నాగలక్ష్మి సైతం ఆమెను పరామర్శించారు. డాక్టర్లు, కుటుంబ సభ్యులు మల్లు లక్ష్మి, మల్లు నాగార్జునారెడ్డిని ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.