Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11 నుంచి 15వరకు రిలే నిరాహార దీక్షలు : వీఆర్ఏ సంఘాల జేఏసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వీఆర్ఏలకు పేస్కేలు, వారసత్వ ఉద్యోగాలు, పదోన్నతులు, డబుల్‌బెడ్ రూమ్ ఇండ్ల హామీలను నెరవేర్చకపోతే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లబోతున్నట్టు తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్ఏ) ఐక్యకార్యాచరణ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం వీఆర్ఏ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్కే దాదేమియా, వంగూరు రాములు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఏ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాపుదేవ్, అంబాల శ్రీధర్ ఒక ప్రకటన విడుదల చేశారు. వీఆర్ఏల జేఏసీ ఆధ్వర్యంలో సీసీఎల్ఏకు గురువారం సర్వీసు రూల్స్ పైనా, డిమాండ్లపైనా వినతిపత్రం అందజే స్తామని తెలిపారు. ఈ నెల 11 నుంచి 15వరకు మండలకేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు నిర్వహిం చాలని వీఆర్ఏలకు పిలుపునిచ్చారు. 16న అధి కారులకు సమ్మె నోటీసు ఇవ్వాలని సూచించారు.