Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగాల భర్తీ ప్రకటనను ఎలా నమ్మాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించారు. గతంలో అనేక ప్రకటనలు చేసిన సీఎం వాటిని అమలు చేయలేదని విమర్శించారు. ఉద్యోగాల భర్తీ పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే దానికి నిర్దిష్ట సమయం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
మీరు పాలించే రాష్ట్రాల్లో భర్తీ చేశారా? : ఆశన్నగారి జీవన్ రెడ్డి
సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగాల ప్రకటనపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విమర్శలు గుప్పించటాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి తప్పుపట్టారు. ఆ పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఖాళీలు భర్తీ చేశారా? అని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లక్షలాది ఖాళీలను భర్తీ చేయలేదని విమర్శించారు. ముందు వాటిని భర్తీ చేస్తేనే రాష్ట్రంలో ఆయా పార్టీల నాయకులకు మాట్లాడే నైతిక అర్హత ఉంటుందన్నారు. ఉద్యోగాలను పొందేందుకు ఆర్మూర్ నియోజకవర్గంలోని యువతకు తన సొంత ఖర్చులతో ఉచితంగా శిక్షణ ఇప్పించనున్నట్టు ప్రకటించారు.
ఆర్ఎస్ఎస్, యువజన కాంగ్రెస్ లో ఉన్న నిరుద్యోగులు కూడా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎద్దేవా చేశారు.