Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సింగరేణిలో వెంటనే భద్రతా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. ఇటీవల ప్రమాదంలో చనిపోయిన ముగ్గురు కుటుంబాలకు రెగ్యులర్ ఉద్యోగులు మరణించిన సమయంలో చెల్లించే నష్టపరిహారాన్ని ఇవ్వాలని కోరారు. బుధవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. గతంలో ప్రమాదాలు జరిగితే ముఖ్యమంత్రి, మంత్రులు బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పేవారనీ, టీఆర్ఎస్ పాలనలో ఆ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం తప్పుడు విధానాల కారణంగానే ప్రమాదం జరిగిందని ఆరోపించారు.