Authorization
Thu March 13, 2025 02:41:14 am
- గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మరో ప్రతిష్టాత్మక కేంద్రాన్ని బీజేపీ సర్కారు గుజరాత్‌కు తరలించింది. అవసరం, సౌకర్యాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం, ఆ రాష్ట్రానికి పెద్ద పీట వేస్తున్నదనే ఇప్పటికే ఉన్నాయి. ప్రస్తుత తరలింపు వ్యవహారం ఆ విమర్శలు వాస్తవమే అనేలా ఉన్నది. మెడికల్ హబ్‌గా పేరుగాంచిన హైదరాబాద్‌ను, సాంప్రదాయ వైద్యానికి పేరుగాంచిన కేరళ రాష్ట్రం లాంటి వాటిని కాదనీ డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషినల్ మెడిసిన్ (డబ్ల్యూహెచ్ఓ జీసీటీఎం)ను గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఆతిథ్య దేశం సంతకం చేయడం ద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థ తొలిసారిగా సాంప్రదాయ వైద్యం కోసం ఏర్పాటు చేసిన ఏకైక గ్లోబల్ అవుట్ పోస్ట్ సెంటర్ ఇది. ఈ కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన కార్యకలాపాల సమన్వయం, అమలు, పర్యవేక్షణ కోసం జాయింట్ టాస్క్ ఫోర్స్ (జేటీఎఫ్) ఏర్పాటు చేసినట్టు, జేటీఎఫ్లో కేంద్ర ప్రభుత్వం, జెనీవా భారత శాశ్వత మిషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులున్నారని ప్రభుత్వం వివరించింది. సాంకేతిక కార్యకలాపాలు, పూర్తిగా పని చేసే డబ్ల్యూహెచ్ఓ జీసీటీఎం ప్రణాళికను అమలు చేయడానికి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని ఐటీఐఆర్‌లో ఒక తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసినట్టు కేంద్ర కేబినెట్ వెల్లడించింది.