Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్యచరణను రూపొందిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర పోలీసు శాఖలో మహిళా పోలీసు అధికారుల ప్రాధాన్యతను పెంచే దిశగా కార్యచరణను పోలీసు ఉన్నతాధికారులు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాలోని ఒక పోలీసు స్టేషన్‌కు ఒక మహిళా ఇన్స్పెక్టర్ను స్టేషన్ హౌజ్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ)గా నియమించబోతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోని లాలాగూడ పోలీసు స్టేషన్‌కు ఇన్స్పెక్టర్గా (ఎస్హెచ్ఓ) మాధవిలత అనే పోలీసు అధికారికి బాధ్యతలను అప్పగించారు. ఈ వరుస క్రమంలోనే ఇతర పోలీసు కమిషనరేట్లు, జిల్లాలో సైతం ఒక్క పోలీసు స్టేషన్ బాధ్యతలను మహిళా ఇన్స్పెక్టర్లకు అప్పగించడానికి పోలీసు ఉన్నతాధికారులు కార్యచరణను రూపొందిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల ఎస్పీలుగా మహిళా ఐపీఎస్ అధికారులను నియమించిన విషయం తెలిసిందే. అదేవిధంగా పలు పోలీసు సబ్డివిజన్ల బాధ్యతలు కూడా మహిళా డీఎస్పీలకు అప్పగించారు. డీజీపీ తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడమే గాక పలు అవార్డులనూ అందుకున్నారు. ఇక రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అదనపు డీజీగా స్వాతి లక్రా, డీఐజీగా సుమతి, టీఎస్ బెటాలియన్స్ అదనపు డీజీగా అభిలాష బిస్త్ లు కర్తవ్యాలను నిర్వహిస్తూ తమ సామర్థ్యాను చాటుతున్నారు. అదేసమయంలో రాష్ట్ర పోలీసు శాఖలో మహిళల ప్రాధాన్యతను పెంచుతూ 33 శాతం రిజర్వేషన్లను కూడా అమలు చేస్తున్నారు.