Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇద్దరు మెరికల్లాంటి పేదింటి బిడ్డలకు మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. అందులో ఒకరు ఐఐటీ ఖరగ్పూర్లో ఇంజనీరింగ్ సీటు సాధించగా, మరొకరునీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సంపాదించారు. సూర్యాపేట్ జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం లోని తుమ్మల పెన్పహాడ్ గ్రామానికి చెందిన పారిశుధ్య కార్మికుడు పిడమర్తి ప్రసా ద్ కుమారుడు అనిల్ కుమార్కు ఐఐటీ ఖరగ్పూర్లో అప్లైడ్ జియాలజీలో ఇంజనీరింగ్ సీటు వచ్చింది. అయితే ఆర్ధిక ఇబ్బందుల వల్ల చదువు కొనసాగించడం కష్టంగా మారింది. విషయం సోషల్ మీడియా ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి రాగా ఆ కుటుంబాన్ని కలిసి అనిల్ కుమార్ విద్యకు కావలసిన ఆర్థిక సాయం అందించారు.