Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో వివిధ శాఖల్లో 80,039 పోస్టులను భర్తీ చేస్తామనీ, 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తామంటూ ప్రకటించిన సీఎం కేసీఆర్కు రైతుబంధు సమితి చైర్మెన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. వివిధ శాఖల్లో ఖాళీ పోస్టులతోపాటు విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులున్నాయని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వయోపరిమితిని పదేండ్లు పెంచడం వల్ల నిరుద్యోగులకు మేలు కలుగుతుందని వివరించారు. కేంద్రంలోని వివిధ శాఖల్లో 15 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఆ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.