Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంట్రిబ్యూటరీ పింఛన్ (సీపీఎస్)ను రద్దు చేస్తూ పాత పింఛన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు చిలగాని సంపత్‌కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. 2014, జూన్ రెండు వరకు కాంట్రాక్టు ఉద్యోగులందర్నీ రెగ్యులరైజ్ చేస్తున్నట్టు సీఎం ప్రకటించడం పట్ల బుధవారం ఒక ప్రకటనలో హర్షం ప్రకటించారు. రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. సీపీఎస్‌ను రద్దు చేస్తామంటూ ఉద్యమ సమయంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రాజస్థాన్, చత్తీస్ఘడ్ ప్రభుత్వాలు సీపీఎస్‌ను రద్దు చేశాయని వివరించారు. ప్రజాప్రతినిధులకు పింఛన్ ఉంటుంది కానీ 30 నుంచి 35 ఏండ్లు పనిచేసిన ఉద్యోగులకు పింఛన్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు.