Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాంసి
మద్యం మహమ్మారి.. సామాన్య ప్రజలనే కాదు.. బాధ్యతగల ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలనూ చిదిమేస్తుంది.. మద్యానికి బానిసైన ఓ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుదవారం తాంసి మండల కేంద్రంలో జరిగింది. మృతుని భార్య, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆదిలాబాద్ జిల్లా దస్తురాబాద్‌కు చెందిన మాడ హరీష్(32)కు తాంసి గ్రామానికి చెందిన జాహ్నవితో 12 ఏండ్ల కిందట వివాహమైంది. తలమడుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రికార్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తించేవాడు. తాంసిలో భార్యతో కలిసి అద్దె ఇంట్లో నివాసముండేవాడు. మంగళవారం అతిగా మద్యం తాగి భార్యతో గొడవ పడి చేయిచేసుకున్నాడు. దీంతో భార్య పుట్టింటికి వెళ్లింది. అనంతరం ఇంట్లో ఉరేసుకున్నాడు. బుధవారం ఉదయం భార్య ఫోన్ చేయగా లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటి యజమానికి చెప్పింది. అతను కిటికీలోంచి చూడగా హరీష్ ఫ్యాన్‌కు వేలాడుతూ కన్పించాడు. ఇంటి యజమానికి వెంటనే విషయాన్ని హరీష్ భార్యకు చెప్పాడు. ఆమె ఇంటికొచ్చాక పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ ధనశ్రీ శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. ఆ దంపతులకు కుమార్తె ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వివరించారు.