Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- దిలావర్పూర్
శ్రమకు తగిన వేతనం ఇవ్వాలని కోరుతూ నిర్మల్ జిల్లా ఎన్‌హెచ్ 61పై టోల్‌ప్లాజా కార్మికులు, ఉద్యోగులు బుధవారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘం అధ్యక్షుడు నామాయి వినోద్ మాట్లాడుతూ.. టోల్ యాజమాన్యం జీతభత్యాలు పెంచుతామని హామీ ఇచ్చి యేండ్లు గడిచినా ఉలుకూపలుకూ లేదన్నారు. పైగా అకారణంగా ఓ ఉద్యోగిని విధుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తొలగించిన ఉద్యోగిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు సరైన సౌకర్యాలు కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో నాలం నర్యయ్య, నడుకుడ శ్రీనివాస్, వినోద్, నవీన్, రవికుమార్, ముత్యం, తేజ, కొప్పుల శ్రీనివాస్, రాకేష్, ముఖేష్ పాల్గొన్నారు.