Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకేసారి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ప్రకటించాలి : ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన 80,039 కొలువుల భర్తీతోనే నిరుద్యోగం నిర్మూలన కాదని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ అభిప్రాయపడింది. ఒకేసారి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. టీఎస్పీఎస్సీ పోర్టల్లో 28 లక్షల మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన ఈ ఉద్యోగాలతో ఏమాత్రం ఉపశమనం కలగబోదని పేర్కొన్నారు. ఎన్నో ఏండ్ల నుంచి విద్యార్థులు, యువకులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని వివరించారు. ప్రకటన కాకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని సూచించారు. కోచింగ్ సెంటర్ల దోపిడీని అరికట్టాలని కోరారు. గతంలో ప్రకటించినట్టుగా కాకుండా ఉద్యోగ నియామక ప్రక్రియను చేపట్టాలని తెలిపారు.