Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బరిలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు, పరిశ్రమ కార్మిక సంఘం అధ్యక్షులు జె.మల్లికార్జున్
- కార్మికుల భారీ విజయోత్సవ ర్యాలీ
నవతెలంగాణ - పటాన్ చెరు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం శివారులో గల తోషిబా పరిశ్రమలో బుధవారం జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో సీఐటీయూ ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించింది. సీఐటీయూ తరపున రాష్ట్ర ఉపాధ్యక్షులు, పరిశ్రమ కార్మిక సంఘం అధ్యక్షులు మల్లికార్జున్ బరిలో నిలవగా హెచ్ఎంఎస్, బీఎంఎస్, టీఆర్ఎస్కేవీ, ఐఎన్టీయూసీ కూటమిగా కాగడ గుర్తుపై ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు సంజీవరెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. పరిశ్రమలో మొత్తం 1016 ఓట్లకు గాను 1004 ఓట్లు పోలయ్యాయి.12 మంది ఓటర్లు గైర్హాజరయ్యారు. కాగా, సంజీవ రెడ్డి పై 219 ఓట్లతో మల్లికార్జున్ భారీ విజయం సాధించారు. ఈ సందర్భంగా పరిశ్రమలో కార్మికులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పటాన్ చెరు పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సీఐటీయూ ఎర్రజెండాను గెలిపించిన తోషిబా కార్మికులకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నట్టు తెలిపారు. కార్మి కులకిచ్చిన హామీలను రాబోయే రోజుల్లో నెరవేర్చేందుకు కృషి చేస్తా మని అన్నారు. ఎవరెన్ని కూటములుగా ఏర్పడినా ఎన్ని ఎత్తులు పన్నినా కార్మికుల విజయం ముందు బోసిపోయాయన్నారు.
కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం, ఉపాధ్యక్షులు, పరిశ్రమ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి అనంతరావు, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, బంగారు రాజు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.