Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆరెకటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా మీర్‌పేట నంది హిల్స్‌కు చెందిన వుల్ కుంద్ కార్ బుచ్చమ్మ నియమితులయ్యారు. బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు బీజాపూర్ ఖాజా రాంజీ ఆమెకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బుచ్చమ్మ మాట్లాడుతూ వెనుకబడిన ఆరెకటిక మహిళల అభివృద్ధికి తన వంతు సహకారం అందజేస్తానని తెలిపారు. అన్ని రంగాల్లో వెనుకబడిన ఆరెకటికల కోసం ప్రభుత్వం వారిని ఎస్సీల్లో కలపాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పలువురు పాల్గొన్నారు.