Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాస్‌బుక్కులను వరుసలో ఉంచి పడిగాపులు
నవతెలంగాణ-కమ్మర్పల్లి
యూరియా కోసం రైతులు పాట్లు పడ్డారు. సరిపడా రాకపోవడంతో పాస్‌బుక్కులు వరుసలో ఉంచి పడిగాపులు కాశారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి సొసైటీ ఎదుట బుధవారం రైతులు యూరియా కోసం బారులు తీరారు. ఉదయం ఒకే ఒక్క లారీ లోడ్ రావడంతో యూరియా సంచులు తీసుకునేందుకు రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. దాంతో ఒక పట్టా పాస్ పుస్తకానికి రెండు సంచుల యూరియా అందజేయడంతో రైతులు బారులు తీరారు. వాటి కోసం జిరాక్స్ కాపీలను వరుసలో ఉంచి పడిగాపులు కాశారు. మధ్యాహ్నం కల్లా మరో మూడు లారీల యూరియా విండో కార్యాలయానికి రావడంతో రైతులు అడిగినంత యూరియా అందించినట్టు విండో కార్యదర్శి నాగరాజు తెలిపారు.