Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియామకాల ప్రక్రియను ప్రారంభించడం ముదావహం : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో 80,039 ఉద్యోగాల భర్తీ, 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడాన్ని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి స్వాగతించారు. కాంట్రాక్టు ఉద్యోగుల్లో జూనియర్, డిగ్రీ కాలేజీల్లో పనిచేసే అధ్యాపకులు అత్యధికంగా ఉన్నారని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్టు అధ్యాపకుల రెగ్యులరైజేషన్ను ఎలాంటి ఆలస్యం చేయకుండా పూర్తిచేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. కాంట్రాక్టు సర్వీసును పరిగణనలోకి తీసుకునేటట్టు ఉత్తర్వులివ్వాలని సూచించారు. రాష్ట్రంలో 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లా, జోనల్, మల్టీ జోనల్ క్యాడర్లలో 95 శాతం స్థానికులకు ఉద్యోగాలను రిజర్వు చేయడం యువతకు మంచి అవకాశమని వివరించారు. ఇప్పటికైనా గ్రూప్-1 పోస్టుల నుంచి గ్రూప్-4 వరకు నియామక ప్రక్రియను ప్రారంభించడం ముదావహమని తెలిపారు. మాధ్యమిక విద్యలో 13,086 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అనేది పెద్ద సంఖ్య అని పేర్కొన్నారు.