Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బొగ్గు పెళ్లల కింద ముగ్గురి మరణం
- మృతదేహాల వెలికితీత
- కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు
- ఆస్పత్రి వద్ద ఆందోళన
- కాంట్రాక్టు కార్మికుని కుటుంబానికి రూ.30లక్షలు.. ఉద్యోగం
నవతెలంగాణ - సింగరేణి ప్రతినిధి/గోదావరిఖని
పెద్దపల్లి జిల్లా సింగరేణి రామగుండం డివిజన్ 3 పరిధిలోని అడ్రియాల లాంగ్వాల్ గని ప్రమాదంలో బొగ్గు బొగ్గు పెళ్లల కూలిన ఘటన విషాదంతమైంది. ముగ్గురు మృతిచెందారు. మూడ్రోజులు సాగిన రెస్క్యూ చర్యల్లో మంగళవారం ఒకరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన విషయం విదితమే. మిగతా ముగ్గురు బొగ్గు పరాద కింద చిక్కుకొని తుది శ్వాస విడిచారు.
సింగరేణి రెస్క్యూ సిబ్బంది 48 గంటలు నిర్విరామంగా చేసిన కృషి ఫలించలేదు. దాదాపు 30 లారీల బొగ్గు కూలినట్టు కార్మికులు తెలిపారు. మంచితనానికి మారుపేరుగా, సుదీర్ఘంగా సింగరేణికి సేవలందించిన ఏరియా సేఫ్టీ ఆఫీసర్ జయరాజు, గని అసిస్టెంట్ మేనేజర్ తేజావత్ చైతన్య
తేజ, శిక్షణలో ఉన్న కాంట్రాక్టు కార్మికుడు తోట శ్రీకాంత్ మృతదేహాలను మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పైకి తీసుకొచ్చారు. అంతకుముందు బొగ్గు పెళ్లల కింద చిక్కుకున్న రవిందర్, వెంకటేశ్వర్లు, నరేష్‌ను రక్షించిన విష యం తెలిసిందే. గనిపైకి మృతదేహాలు చేరగా.. ఆ ప్రాంతమంతా విషాదంతో నిండిపోయింది. సహోద్యోగులు, బంధువులు, మిత్రులు, పరిసర ప్రాంతాల ప్రజ లు తీవ్రంగా విలపించారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం వారి స్వగ్రా మాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. తోట శ్రీకాంత్ మృతదేహాన్ని సింగరేణి గోదా వరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. గని, సింగరేణి హాస్పిటల్ వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మార్చురీ వద్ద ఆందోళన
కాంట్రాక్టు కార్మికుడు తోట శ్రీకాంత్ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని హాస్పిటల్ వద్ద కార్మిక సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మార్చురీ గది ముందు నాయకులతో పాటు, బంధువులు ఆందోళనకు దిగారు. మృతదేహంతో గని వద్దకు వెళ్లి ధర్నా చేయడానికి మార్చురీ తాళం పగలకొట్టడానికి బంధువులు యత్నించారు. ఈ క్రమంలో అడ్డుకున్న పోలీసులకు వారికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తరువాత సింగరేణి యాజమాన్యం పలు దఫాలుగా కార్మిక నాయకులతో జరిపిన చర్చలు సాయంత్రం ఫలప్రదం అయ్యాయి. 30లక్షల రూపాయల నష్ట పరిహారం, కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టర్ వద్ద ఉద్యోగం ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించింది. చర్చల్లో పెద్దపెల్లి జిల్లా పరిషత్ చైర్మెన్ పుట్ట మధు, సీఐటీయూ, ఏఐటీయుసీ, ఐఎన్టీయుసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ప్రయివేటీకరణతోనే ప్రమాదాలు
సింగరేణి బొగ్గు గనుల్లో పెరిగిన ప్రయివేటీకరణ వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం అడ్రియాల బొగ్గు గని ప్రమాద బాధిత కుటుంబాలను గోదావరిఖనిలో పరామర్శించారు.