Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ప్రకటిస్తామనీ, వయోపరిమితిని పెంచడాన్ని సీపీఐ రాష్ట్ర సమితి స్వాగతించింది. 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమ బద్ధీకరిస్తున్నట్టు ప్రకటించడం హర్షణీయమని తెలిపింది. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వివిధ శాఖల్లో కోర్టుకు వెళ్లకుండా ఉన్న పలువురు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల భవితవ్యంపై సీఎం ప్రస్తావించలేదని తెలిపారు. 2018 ఎన్నికల హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి రూ.3,016 ప్రస్తావించలేదని వివరించారు. కాంట్రాక్టు విధానం ఇక ఉండబోదంటూ ప్రకటించినందుకు వాటిపై తక్షణమే సానుకూల ప్రకటన చేయాలని కోరారు. షెడ్యూల్ 8,9లో పేర్కొన్న ఉమ్మడి సంస్థల విభజన కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచేందుకు అన్ని పార్టీల సహకారం తీసుకోవాలని సూచించారు.