Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్పీఏటీఎస్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్లనూ రెగ్యులరైజ్ చేయాలని సీఆర్పీఏటీఎస్ అధ్యక్షులు దుండిగల్ యాదగిరి, ప్రధాన కార్యదర్శి రేగుల సహదేవ్ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. 80,039 ఉద్యోగాలను భర్తీచేస్తామంటూ సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని స్వాగతించారు. 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్టు ప్రకటించారని తెలిపారు. వాస్తవంగా సమగ్రశిక్షలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులైన సీఆర్పీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఇన్స్ట్రక్టర్లు, ఐఈఆర్పీలు, మెసెంజర్లు, కేజీబీవీల్లో పనిచేస్తున్న సీఆర్టీలందరినీ రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.