Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఈనెల 28,29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో తాము కూడా పాల్గొంటున్నట్టు మిషన్ భగీరధ ఉద్యోగులు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ)కి సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జెంజిరాల శ్రీనివాస్, వంగూరు రాములు మాట్లాడుతూ సమ్మె నోటీసుతో పాటు 16 డిమాండ్ల నోట్‌ను కూడా అందచేశామని తెలిపారు.