Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రుల్ని కలిసిన ఉద్యోగుల
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
శాసనసభలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రకటన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తమను విస్మరించారని సెర్ప్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం వందలమంది సెర్ప్ ఉద్యోగులు బృందాలుగా మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, టీ హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలను కలిశారు. వివాదాలు లేకుండా సమస్యలు పరిష్కరించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ మరికొంత సమయం తీసుకుంటున్నారనీ, సహనంతో ఉండాలని ఈ సందర్భంగా మంత్రులు వారికి చెప్పారు. సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నామనీ, ఇక సర్వీసు 10 నుంచి 15 ఏండ్ల వరకే ఉన్నదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని మంత్రులు హామీ ఇచ్చారు. సెర్ప్ ఉద్యోగ సంఘాల స్టేట్ జేఏసీ నాయకులు
కుంట గంగాధర్ రెడ్డి నరసయ్య మహేందర్ రెడ్డి, సుదర్శన్, సుభాష్, సురేఖ వెంకట్, గిరి, జానయ్య, గడ్డి అశోక్, మధు, రాజారెడ్డి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.