Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పబ్లిక్ సెక్టార్ కో ఆర్డినేషన్ నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 28,29 తేదీల్లో తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు పబ్లిక్ సెక్టార్ కో ఆర్డినేషన్ కమిటీ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ సమ్మెను జయప్రదం చేయాలని కార్మికులకు, ఉద్యోగులకు పిలుపునిచ్చింది. ఈ నెల 12లోపు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల యాజమాన్యాలకు సమ్మె నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. గురువారం హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ బీడీఎల్ కంపెనీలో ఆలిండియా సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్, ఫెడరేషన్లు, అసోసియేషన్ల సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా, దేశ వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండించింది. ఈ సమావేశంలో హైదరాబాద్ పబ్లిక్ సెక్టార్ కంపెనీలు, ఈసీఐఎల్ నుంచి సీహెచ్ భాస్కర్‌రెడ్డి, బీఈఎల్ నుంచి సౌందర్‌రాజ్, బీహెచ్ఈఎల్ నుంచి కొండల్‌రెడ్డి, మిధాని నుంచి రుషికేష్, హెచ్ఏఎల్ నుంచి వెంగల్రెడ్డి,బీడీఎల్ నుంచి బాపురావు, ఐఎన్టీయూసీ నాయకులు విజరుకుమార్ యాదవ్, ఏఐటీయూసీ నాయకులు చంద్రయ్య, సీఐటీయూ కార్యదర్శి జె వెంకటేశ్, టీఆర్ఎస్ కేవీ నాయకులు దానకర్ణాచారి, హైదరాబాద్ కో ఆర్డినేషన్ కమిటీ నాయకులు రాఘవరావు పాల్గొన్నారు.