Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన సంఘం డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు జాటోత్ ఠానునాయక్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మానాయక్ గురువారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ సమాజ్వలకు వినతి పత్రం అందజేశారు. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా, భూస్వాములకు రజాకార్లకు వ్యతిరేకంగా ఆయన పోరాడారని తెలిపారు. చారిత్రాత్మకమైన ఆ విముక్తి పోరాటంలో పాల్గొన్న ఠానూనాయక్ విగ్రహాన్ని నెలకొల్పటం సముచితమని పేర్కొన్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో గిరిజన సంఘం నాయకులు వి రామ్కుమార్నాయక్ పాల్గొన్నారు.