Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రవాణాశాఖ కమిషనర్‌కు ప్రయివేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ సమ్మెనోటీసు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఈనెల 28,29 తేదీల్లో జరిగే దేశావ్యాప్త సార్వత్రిక సమ్మెలో తాము కూడా పాల్గొంటున్నట్టు తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రయివేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) తెలిపింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ శ్రీకాంత్, నగర కార్యదర్శి ఎమ్డీ ఆసిఫ్ తదితరులు గురువారం ఖైరతా బాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో జాయింట్ కమి షనర్ పాండురంగనాయక్‌కు సమ్మె నోటీసు అంద చేశారు. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం సమ్మె నోటీసు ఇచ్చినట్టు వారు తెలిపారు. నోటీసుతో పాటు 12 డిమాండ్లతో కూడిన లేఖను కూడా అందచేశారు.