Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉద్యోగులు, అధికారులు రూపొందించిన పల్లెప్రగతి డైరీని మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు గురువారం శాసనమండలిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లెలు పచ్చగా ఉన్నాయంటే ఆయా శాఖల అధికారులే కారణమన్నారు. ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేయడం వల్లే మంచి ఫలితాలు వచ్చాయనీ, కేంద్ర, రాష్ట్ర అవార్డులు, రివార్డులు వచ్చాయని చెప్పారు. రాష్ట్రానికి చెందిన పల్లెలు దేశానికే ఆదర్శంగా, తలమానికంగా నిలవడానికి అధికారుల పనితీరే కారణమని వివరించారు. కరోనా వంటి భయంకరమైన వ్యాధులను ఎదుర్కోగలిగే స్థాయికి పారిశుధ్యాన్ని నిర్వహించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కమిషనర్ ఎ శరత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.