Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అశ్వినిని అభినందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
నవతెలంగాణ-ఖానాపూర్ రూరల్
నిర్మల్ డిపో మహిళా కండక్టర్ అశ్వినిని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభినందించారు. మహిళా దినోత్సవ సంబరాల్లో భాగంగా నిర్మల్ డిపోకు చెందిన అశ్విని(కండక్టర్) స్వయంగా రాసి పాడిన పాట పలువురిని ఆకట్టుకుంటోంది. ఆ పాటకు సంబందించిన పోస్టర్లను గురువారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఎండీ సజ్జనార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అశ్వినితో పాటు మహిళా కండక్టర్లు సంధ్యారాణి, ప్రతిభ, రమాదేవి, జ్యోతిని అభినందించారు. ఆర్టీసీని ప్రజలు ఆదరించాలని, ఆర్టీసీ కల్పిస్తున్న సేవలు, సౌకర్యాలపై కూలంకషంగా వివరిస్తూ రాసి పాడిన అశ్వినిని ఎండీ సజ్జనార్‌తో పాటు డిపో మేనేజర్ ఆంజనేయులు, అసిస్టెంట్ మేనేజర్లు ప్రతిమారెడ్డి, విశ్వనాథ్‌తో పాటు ఆర్టీసీ ఉద్యోగులు అందరూ అభినందించారు.