Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్ పద్దులపై చర్చలో సీతక్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఆసరా పింఛన్ల కోసం లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారనీ, వారికి వెంటనే పింఛన్లు ఇవ్వాలని కాంగ్రెస్ సభ్యులు సీతక్క డిమాండ్ చేశారు. వెంటనే సంబంధిత వెబ్సైట్ పున:ప్రారంభిం చాలని కోరారు. గురువారం అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఏడేండ్ల కాలంలో ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయనీ, ఉపాధి సౌక ర్యాలు తగ్గిపోయాయన్నారు. ఐటీతోపాటు ఇతర ఏ పరిశ్రమ స్థాపించినా స్థానికులకు 95 శాతం ఉద్యోగాలు దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమలు ఒకేచోట కేంద్రీకృతం కాకుండా ఆయా జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వాటిలో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులు పని చేయడం లేదనీ, డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిం చలేదని చెప్పారు.
మహిళలు విద్యావంతులైతేనే సమాజావృద్ధి : గొంగిడి సునీత
వైద్య, విద్య, పారిశ్రామిక, రాజకీయ, అంతరిక్ష రంగాల్లో మహిళలు విజయాలు సాధిస్తున్నారని టీఆర్ఎస్ సభ్యులు గొంగిడి సునీత చెప్పారు. మహిళలు విద్యావంతు లైతేనే యావత్ సమాజం బాగుపడుతు న్నదని తెలిపారు. అమ్మాయిల కోసం సీఎం కేసీఆర్ గురుకులాలు, కళాశాలను ఏర్పాటు చేశారని చెప్పారు. కోఠి ఉమెన్స్ కాలేజీని మహిళా యూనివర్సిటీగా మార్చడం గొప్ప విషయమన్నారు. గురువారం శాసన సభలో ఆమె పద్దులపై మాట్లాడారు. పాఠశాలల్లో చదువుకుంటున్న అమ్మాయి లకు హెల్త్ అండ్ హైజెనిక్ కిట్లను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుతో బాల్య వివాహాలను నిరోధించగలిగామ న్నారు. ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా గర్భిణి స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నదనీ, అంగన్ వాడీ సెంటర్ల ద్వారా చిన్న పిల్లలకు కూడా పౌష్టికాహారాన్ని ఇస్తున్నదని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిం దనీ, వాటిని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకపోవాలని అధికార పార్టీకి చెందిన మరో సభ్యుడు గువ్వల బాల్‌రాజు తెలిపారు. అందు కోసం సమాచార శాఖను ఉపయోగించుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అవినీతి సొమ్ముతో ఓట్లు కొల్ల గొడుతున్నదని చెప్పారు. అదానీ, అంబా నీలకు ప్రజా ధనాన్ని కట్టబెడుతున్న దని విమర్శించారు.