Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికులకు టీఎస్ఆర్టీసీ జేఏసీ పిలుపు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆర్టీసీ కార్మికులకు పిలుపునిచ్చింది. సమ్మెలో పాల్గొనేందుకు వీలుగా డిపోలవారీగా శుక్రవారం సమ్మె నోటీసులు ఇవ్వాలని దిశానిర్దేశం చేసింది. జేఏసీ కార్మిక సంఘాల జనరల్ బాడీ సమావేశం గురవారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞానకేంద్రం కాట్రగడ్డ శ్రీనివాసరావు హాల్లో జరిగింది. జేఏసీ చైర్మెన్ కే రాజిరెడ్డి (ఎంప్లాయీస్ యూనియన్) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైస్ చైర్మెన్ కే హన్మంతు ముదిరాజ్ (టీజేఎమ్‌యూ), కన్వీనర్లు వీఎస్ రావు (టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్-ఎస్‌డబ్ల్యూఎఫ్), పి కమాల్‌రెడ్డి (ఎన్‌ఎమ్‌యూ), కో కన్వీనర్లు జీ అబ్రహం (ఎస్‌డబ్ల్యూయూ), కే యాదయ్య (బీకేయూ), ఎస్ సురేష్ (బీడబ్ల్యూయూ), పి హరికిషన్ (ఎస్‌టీఎమ్‌యూ), బీ యాదగిరి (కార్మిక పరిషత్) తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీలోని వివిధ డిపోల్లో పనిచేస్తున్న కార్మిక సంఘాల ప్రతినిధులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. పలుచోట్ల ఈ సమావేశానికి కార్మిక నేతలు రాకుండా పోలీసులు అడ్డుకొని, తెల్లవారుజామున వారిని అరెస్టులు చేయడాన్ని జేఏసీ తీవ్రంగా ఖండించింది. సమ్మె ఏర్పాట్లలో భాగంగా ఈనెల 13 నుంచి 21 వరకు జేఏసీ రీజియన్ స్థాయి సమావేశాలు నిర్వహించాల నీ, 17వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన సంతకాల జాబితాను లేబర్ కమిషనర్‌కు అందచేయాలని పేర్కొంది.ఆర్టీసీ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రెండు శాతం నిధులు కేటాయిస్తూ, అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు విధానపర నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. జేఏసీ కమిటీ సభ్యులు రవీందర్‌రెడ్డి, రాంచందర్, వెంకన్న, స్వాములయ్య తదితరులు పాల్గొన్నారు.
సార్వత్రిక సమ్మెలో
జీహెచ్ఎంసీ కార్మికులు
- కమిషనర్‌కు సమ్మె నోటీసు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఈ నెల 28,29 తేదీల్లో జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా రాష్ట్రంలోని జీహెచ్ఎంసీ పారిశుధ్య, ఇతర విభాగాల్లోని కాంట్రాక్ట్ కార్మికులంతా సమ్మెలో పాల్గొనబోతున్నారని ఈ ఈ మేరకు గురువారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ డీఎస్ లోకేష్‌కుమార్‌కు కార్మిక సంఘాలు సంయుక్తంగా సమ్మె నోటీను అందించాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశంలో జాతీయ కార్మిక సంఘాలు, రాష్ట్రంలో వివిధ కార్మిక, ఉద్యోగ సంఘాలు ఈ సమ్మెను నిర్వహిస్తున్నాయని తెలిపారు.