Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రసూతి మరణాలను తగ్గించడంలో తెలంగాణ దేశంలో మూడో స్థానంలో నిలిచిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. కేరళ, మహారాష్ట్ర తర్వాత మూడో స్థానంలో రాష్ట్రం ఉన్నట్టు 2017-19 మెటర్నల్ మోర్టాలిటీ ఇన్ ఇండియా ప్రత్యేక బులెటిన్ ప్రకటించిందని పేర్కొన్నారు. మరణాల రేటు 92 నుంచి 56కు తగ్గించగలిగామని తెలిపారు. ఇందు కోసం కృషి చేసిన ఆరోగ్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు..