Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈడీకి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వ పరిధిలో స్వతంత్రంగా విచారణ చేయాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన అన్ని ఆధారాలు, సాక్ష్యాలు వెంటనే ఈడీకి అందజేసి కోర్టు ఆదేశాలు పాటించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు హైదరాబాద్‌లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌కు ఆయన వినతిపత్రం సమర్పించారు.అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. డ్రగ్స్ వాడే వాళ్లు ఎంత పెద్దవాళ్లయినా సరే చర్యలు తీసుకోవాలని కోరారు. 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్నదనీ, అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ దొంగల అంతు చూస్తామని హెచ్చరించారు. మాదకద్రవ్యాల కేసు విచారణ వివరాలను ఈడీకి ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని చెప్పారు. ఎవర్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు.