Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మళ్ళీ మల్లయ్యే...
- నియామకపత్రం ఇచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణి ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆ సంస్థను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయివేటుకు అప్పగించబోమన్నారు. అవసరమైతే కేంద్రవాటాను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి, సింగరేణిని రాష్ట్ర సంపదగానే ప్రకటిస్తామన్నారు. శుక్రవారం ఆమె నివాసంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీలు మాలోతు కవిత, వెంకటేష్ నేతకాని, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, గండ్ర వెంకటరమణారెడ్డి, దుర్గం చెన్నయ్య, దివాకర్‌రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ( టీబీజీకేఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మళ్లీ కెంగర్ల మల్లయ్యను కొనసాగిస్తూ ఎమ్మెల్సీ కవిత ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సింగరేణికి చెందిన 4 బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. బొగ్గు గనుల్లో ప్రమాదవశాత్తు మరణించిన సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు ఈ సందర్భంగా నివాళులు అర్పించారు.